Share News

మా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయరా?

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:04 AM

తమ గ్రామంలో పాఠశాల నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ కరకవలస పంచాయతీ మారిక గ్రామానికి చెందిన గిరిజనులు, వారి పిల్లలు మంగళవారం స్థానిక ఎమ్మార్సీని ముట్ట డించారు.

మా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయరా?

  • విద్యార్థులతో కలిసి మారిక గిరిజనుల ఆందోళన

  • ఎమ్మార్సీ ముట్టడి

వేపాడ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): తమ గ్రామంలో పాఠశాల నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ కరకవలస పంచాయతీ మారిక గ్రామానికి చెందిన గిరిజనులు, వారి పిల్లలు మంగళవారం స్థానిక ఎమ్మార్సీని ముట్ట డించారు. సీపీఎం జిల్లా నాయకుడు చల్లా జగన్‌ సార థ్యంలో ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో చదువు కునే వయస్సు ఉన్న 27 మంది పిల్లలు ఉన్నా ప్రభు త్వం పాఠశాల భవనం నిర్మించకపోవడం ఏంటని ప్రశ్నించారు. తమ గ్రామంలో పాఠశాల భవనం నిర్మిం చేవరకు మండల కేంద్రంలోనే తమ పిల్లలకు పాఠాలు నేర్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న డీఈవో మా ణిక్యంనాయుడు, డిప్యూటీ డీఈవోతో పాటు వేపాడ చేరుకున్నారు. మార్చి నా టికి గ్రామంలో పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేస్తాం.. వచ్చే విద్యా సం వత్సరానికి భవనం ప్రా రంభించేలా చర్యలు తీసుకుంటా మని డీఈవో హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన వివరించారు. మార్చి నెలలో పాఠశాల భవన నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టకపోతే మళ్లీ ఉద్యమాన్ని చేపట్టక తప్పదని జగన్‌ హెచ్చరించా రు. డీఈవో వెంట ఎంఈవో బాలభాస్కరరావు, ఎంపీడీవో సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 12:04 AM