Share News

టెట్‌ నుంచి మినహాయించాలి

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:17 AM

ww

 టెట్‌ నుంచి మినహాయించాలి
ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహిస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

బెలగాం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆదివారం ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం జీజే కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్‌, నాలుగు రోడ్ల కూడలి మీదుగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ 25-30 ఏళ్ల సర్వీసు చేసిన ఉపాధ్యాయులకు టెట్‌ అర్హత తప్పనిసరి చేయడం సరికాదని పేర్కొన్నారు. ఆర్‌టీఈ చట్టంలోని 23(1) క్లాజును సవరించి ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌రావు, జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి కె.భాస్కరరావుతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:18 AM