ప్రభుత్వ బడుల్లో చేర్పించాలి
ABN , Publish Date - May 12 , 2026 | 12:21 AM
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈవో మాణిక్యంనాయుడు కోరారు.
విజయనగరం దాసన్నపేట, మే 11(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈవో మాణిక్యంనాయుడు కోరారు. సోమవారం మలిచర్ల స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని కొత్తకాపువానిపేటలో నిర్వహించిన ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశా లలకు ధీటుగా అత్యున్నత ఫలితాలు వస్తున్నాయన్నా రు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాఽధ్యాయులు సుజాత, కామేశ్వరరావు, వీఎస్‌ఎన్ మూర్తి, పాల్తేరు శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.