‘డ్రగ్స్ డైరీ’ లఘుచిత్రం విడుదల
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:01 AM
పట్టణంలోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఆదివారం అభ్యుదయం 2.0లో భాగంగా డ్రగ్స్ డైరీ లఘు చిత్రాన్ని డీఎస్పీ ఎం.రాంబాబు విడుదల చేశారు.
పాలకొండ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఆదివారం అభ్యుదయం 2.0లో భాగంగా డ్రగ్స్ డైరీ లఘు చిత్రాన్ని డీఎస్పీ ఎం.రాంబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుడూ డ్రగ్స్‌కు బానిసైతే ఎదురయ్యే దుష్పరిణామాలను కళ్లకు కట్టినట్టు విశ్వజల్లు, ఆయన బృందం ఈ లఘు చిత్రాన్ని రూపొందించారన్నారు. డ్రగ్స్ డైరీ లఘు చిత్రం ప్రజల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన పెంచడంతో పాటు వాటికి దూరంగా ఉండేలా చైతన్యం కల్పించే విధంగా రూపకల్పన చేశారన్నారు.