వైసీిపీకి షాక్
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:56 AM
మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
తెర్లాం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీలో ఇక కొనసాగ లేమని తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు గురువారం రాజీనామా చేశారు. మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుతోనే తాము ఉంటామని తెగేసి చెప్పారు. గురువారం మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ అధ్యక్షతన గురువారం తెర్లాంలోని ఓ రైస్‌మిల్లు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ముందుగా 8 పంచాయతీల పరిధిలోని 11 గ్రామాల నుంచి మాజీ సర్పంచ్‌లు శనపతి రాంబాబు, బురాడ తవిటినాయుడు, దాలి గోపి, చందక సత్యనారాయణ... మాజీ ఎంపీటీసీ సభ్యులు చేపేన పాల్గుణరావు, చేపేన సత్యనారయణ, చింత అప్పారావు, మాజీ ఏఎంసీ డైరక్టర్ కుచ్చర్లపాటి భద్రరాజు, వైసీపీ మండల మహిళ అధ్యక్షురాలు కర్రి స్వర్ణలతతో పలువురు కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో 800 కుటుంబాలతో ఎమ్మెల్యే బేబీనాయన, చిన్న శ్రీను అనుమతితో టీడీపీలో చేరుతామన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యుడు వలిరెడ్డి శ్రీనువాసరావు, కోట్ల వెంకటరావు, బూర్లి నరేశ్ పాల్గొన్నారు. రెండు రోజుల కింద తెర్లాంలో బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించిన అనంతరం పెద్దఎత్తున వైసీపీకి మాజీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడం చర్చనీయంశమైంది.