Shine in NEET నీట్‌లో మెరిశారు..
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:02 AM
Shine in NEET వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ పరీక్షల్లో మన్యం విద్యార్థులు మెరిశారు. ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు.
సీతానగరం, జూలై 17(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ పరీక్షల్లో మన్యం విద్యార్థులు మెరిశారు. ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. సీతానగరం మండలం చెల్లంనాయుడువలసకి చెందిన కొట్టాన సాయిభవ్య నీట్ ఫలితాల్లో ప్రతిభ చాటింది. రాష్ట్రస్థాయిలో 301వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి కొట్టాన తేజేశ్వరరావు విజయనగరం జిల్లా గాజులరేగ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా, తల్లి పూసపాటిరేగ వ్యవసాయశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. సాయిభవ్య విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీతానగరానికి చెందిన కె.విష్ణుమిహిర్ నీట్ పరీక్షలో 661 మార్కులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 833వ ర్యాంకు పొందాడు. ఆ విద్యార్థి నీట్‌లో ప్రతిభ కనబర్చడంపై తల్లిదండ్రులు రవీంద్రకుమార్, చైతన్య , కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.