Share News

she was in struggle..! ఏం కష్టమొచ్చిందో..!

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:34 AM

she was in struggle..! పాపం ఆమెకు ఏం కష్టమొచ్చిందో.. భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేని సమయం చూసి శరీరానికి నిప్పుంటుంచుకుంది. దాదాపు 90శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడింది.

she was in struggle..! ఏం కష్టమొచ్చిందో..!
భవాని(ఫైల్‌)

ఏం కష్టమొచ్చిందో..!

శరీరానికి నిప్పంటించుకున్న వివాహిత

భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్య

శృంగవరపుకోట, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):

పాపం ఆమెకు ఏం కష్టమొచ్చిందో.. భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేని సమయం చూసి శరీరానికి నిప్పుంటుంచుకుంది. దాదాపు 90శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని గంటల్లోనే ప్రాణాలు విడిచింది. శృంగవరపుకోట బ్రాహ్మణ వీధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో కొల్ల భవాని(32) మృతిచెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కొల్ల నారాయణ, భార్య భవాని(32)లు ఇద్దరు పిల్లలుతో మూడు సంవత్సరాలుగా శృంగవరపుకోట బ్రాహ్మణ వీధిలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా వున్న సప్లయిర్స్‌ దుకాణంలో భర్త పనిచేస్తున్నాడు. శుక్రవారం ఎప్పటిలాగే పనికి వెళ్లిపోయాడు. పిల్లల్లో చిన్నబ్బాయి అంగన్‌వాడీ కేంద్రానికి, పెద్దబ్బాయి పాఠశాలకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భవాని మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కట్టెలను ఇంట్లోకి తీసుకువచ్చింది. వాటిని పేర్చి పెట్రోల్‌ పోసింది. వాటిపై కూర్చొని తానకు తానుగా నిప్పుఅంటించుకుంది. మంటలు పెద్దగా రావడంతో గమనించిన చుట్టుపక్కల వారు పరుగున వచ్చి ఆర్పారు. అనంతరం భర్తకు సమాచారం అందించారు. ఆమెను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. 90శాతం పైబడి గాయాలైన ఆమెకు ప్రాథమిక చికిత్స చేసిన ఇక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె సాయంత్రం 4గంటల సమయంలో మృతి చెందింది. భవాని మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు అందించారని సీఐ వి.నారాయణ మూర్తి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

-----------------

Updated Date - Mar 14 , 2026 | 12:34 AM