Share News

She saved her grandson మనవడ్ని కాపాడింది

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:11 AM

She saved her grandson ఓ వృద్ధురాలి సాహసం ఆమె కుటుంబానికి పెను విషాదాన్ని తప్పించింది. అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా ఏమాత్రం భయపడకుండా చిన్నారిని కాపాడింది. ఈ ఘటన లోతుగెడ్డ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

She saved her grandson మనవడ్ని కాపాడింది
చిన్నారితో తల్లి, అమ్మమ్మ

మనవడ్ని కాపాడింది

మంటల్లోకి దూకి రక్షించిన అమ్మమ్మ

లోతుగెడ్డ గ్రామంలో ఘటన

మెంటాడ, మార్చి 12(ఆంధ్రజ్యోతి):

ఓ వృద్ధురాలి సాహసం ఆమె కుటుంబానికి పెను విషాదాన్ని తప్పించింది. అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా ఏమాత్రం భయపడకుండా చిన్నారిని కాపాడింది. ఈ ఘటన లోతుగెడ్డ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వృద్ధురాలు చిన్నమ్మి ఇటీవల గ్రామంలో జరిగిన పండగకు కుమార్తెకు పిలుపు చేయడంతో కుమార్తె రాములమ్మ ఏడాది కొడుకుతో అమ్మ వారింటికి వచ్చింది. గురువారం చిన్నారిని ఉయ్యాలలో నిద్రబుచ్చి బయటకు వెళ్లింది. మనవడు రఘవరన్‌ నిద్రపోతున్నందున చిన్నమ్మి కూడా పొరుగు ఇంటికి వెళ్లింది. కాసేపటికి ఇంట్లోనుంచి పెద్దఎత్తున పంటలు పుట్టాయి. అక్కడున్న వారు కేకలు వేయడంతో చిన్నమ్మి పరుగునవచ్చి చూసేసరికి తన తాటాకు ఇల్లు లోపలిభాగంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఉయ్యాలలో మనవడు పడుకున్న విషయం గుర్తుకొచ్చి క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి మంటలను ఛేదించుకుంటూ ఇంట్లోకి వెళ్లింది. ఉయ్యాలలో ఉన్న మనవడిని పట్టుకుని ఉక్క ఉదుటన బయటకు పరుగులు తీసి చిన్నారిని కాపాడింది. చిన్నమ్మి అప్రమత్తతను, సహసాన్ని కళ్లారా చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. మనవడికి కూతురు జన్మనిస్తే, అమ్మమ్మ పునర్జన్మనిచ్చిందని కొనియాడారు. ప్రమాదంలో చిన్నమ్మి ఇంట్లోని రూ.80 వేల నగదు బూడిదైంది. రెండు తులాల బంగారం నగలు కాలిపోయాయి. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ప్రమాదంతో సర్వం కోల్పోయి కుటుంబం వీధిన పడింది.

Updated Date - Mar 13 , 2026 | 12:11 AM