బాల్య వివాహాన్ని అడ్డగించిన శక్తి టీమ్
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:13 AM
పాలకొండ శక్తి టీమ్ బృందం బాల్య వివాహం జరగకుండా శుక్రవారం అడ్డగించింది. ఎస్‌ఐ వెంకన్నకు అందిన సమాచారం మేరకు తుమరాడ గ్రామానికి శక్తి టీమ్ సభ్యులు చేరు కున్నారు.
పాలకొండ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పాలకొండ శక్తి టీమ్ బృందం బాల్య వివాహం జరగకుండా శుక్రవారం అడ్డగించింది. ఎస్‌ఐ వెంకన్నకు అందిన సమాచారం మేరకు తుమరాడ గ్రామానికి శక్తి టీమ్ సభ్యులు చేరు కున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థినికి వివాహం జరుగుతుందని తెలుసుకున్నారు. సదరు బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు కౌన్సి లింగ్ చేశారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. దానికి కఠిన శిక్షలు తప్పవని వివరించారు. అలాగే బాల్య వివాహం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులను ఒప్పించి వివాహాన్ని నిలుపుదల చేయించారు. కౌన్సిలింగ్‌లో శక్తిటీం సభ్యులు ఝాన్సీ, ప్రకృ తాంబ, రాము, శోభ, తుమరాడ సచివాలయానికి ఉద్యోగులు పాల్గొన్నారు.