Share News

Sex Determination Tests లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:13 AM

Sex Determination Tests Are a Crime స్కానింగ్‌ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సంబంధిత వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు.

Sex Determination Tests  లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
టోల్‌ ఫ్రీ నెంబర్‌ పోస్టర్‌ విడుదల చేస్తున్న డీఎంహెచ్‌వో

పార్వతీపురం, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): స్కానింగ్‌ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సంబంధిత వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిస్తే.. ప్రజలు వెంటనే ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18002332447కు ఫోన్‌ చేసి సమచారం అందించాలని సూచించారు. అనంతరం దీనిపై పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు విజయమోహన్‌, రవికుమార్‌రెడ్డి, కౌశిక్‌ తదితరులున్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:13 AM