Share News

విద్యుదాఘాతంతో ఏడు మేకల మృతి

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:07 AM

గరివిడి కొండపాలెం హడ్కో కాలనీ సమీపం లో ఒక ఇంటి పెరటి వైపు ఉన్న మేకల శాలపై విద్యుత్‌ వైర్లు తెగి పడిపోవడం తో ఏడు మేకలు, కొన్ని కోళ్లు మృతిచెందాయి.

విద్యుదాఘాతంతో ఏడు మేకల మృతి

గరివిడి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): గరివిడి కొండపాలెం హడ్కో కాలనీ సమీపం లో ఒక ఇంటి పెరటి వైపు ఉన్న మేకల శాలపై విద్యుత్‌ వైర్లు తెగి పడిపోవడం తో ఏడు మేకలు, కొన్ని కోళ్లు మృతిచెందాయి. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. తెగిపడిన విద్యుత్‌ వైర్లు మేకల షెడ్‌కు సంబంధించిన ఇనుప ఫెన్సింగ్‌కు తాకడంతో మేకలు విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందాయి. షాక్‌కు గురై న మేకల అరుపులకు మిగిలిన మేకలు భయపడి.. అక్కడి నుంచి పారపో వడంతో ప్రాణాలతో బయటపడ్డాయి. కొండపాలెం ప్రాంతానికి చెందిన గడపర్తి అసిరన్నదొర మేకలు, గొర్రెల ఫారంను ఇంటి వద్ద నిర్వహిస్తున్నారు. విద్యుత్‌ వైర్లు తెగిపడిన సమయంలో అసిరన్నదొర అక్కడ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. విద్యుత్‌ శాఖాధికారులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి, అధికారులకు నివేదికలను అందజేశారు.

Updated Date - Apr 10 , 2026 | 12:07 AM