Share News

House Tax Collections ఇంటి పన్ను వసూళ్లలో వెనుకంజ

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:21 AM

Setback in House Tax Collections ఇంటి పన్నుల విషయంలో జిల్లా వెనుకబడింది. గడువు దాటినా లక్ష్యాలను చేరుకోలేకపోయింది. ఈ నెల 15లోగా శతశాతం పన్నులు వసూలు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభి వృద్ధిశాఖ కమిషనర్‌ ఎం.కృష్ణతేజ ఆదేశించారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. గడువు దాటిపోయినా అధికారులు ఇంటి పన్ను వసూళ్లలో లక్ష్యాలను చేరుకోలేకపోయారు.

House Tax Collections ఇంటి  పన్ను వసూళ్లలో  వెనుకంజ

  • గడువు దాటినా లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన అధికారులు

పార్వతీపురం, ఫిబ్రవరి27(ఆంధ్రజ్యోతి): ఇంటి పన్నుల విషయంలో జిల్లా వెనుకబడింది. గడువు దాటినా లక్ష్యాలను చేరుకోలేకపోయింది. ఈ నెల 15లోగా శతశాతం పన్నులు వసూలు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభి వృద్ధిశాఖ కమిషనర్‌ ఎం.కృష్ణతేజ ఆదేశించారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. గడువు దాటిపోయినా అధికారులు ఇంటి పన్ను వసూళ్లలో లక్ష్యాలను చేరుకోలేకపోయారు. క్షేత్రస్థాయిలో కొంతమంది గ్రామ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం, పన్ను వసూళ్లపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ కొవడడమే ఈ పరిస్థితికి కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 451 పంచాయతీల్లో 1,91,446 ఇళ్లకు సంబంధించి రూ.5.80 కోట్లు పన్ను వసూలు కావాల్సి ఉంది. కాని నేటి వరకు రూ.3.72 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా సుమారు రూ. రెండు కోట్లకు పైగా ఇళ్ల పన్ను వసూలు కావాల్సి ఉంది.

వెనుకబడిన పార్వతీపురం డివిజన్‌...

ఇంటిపన్నుల వసూలు విషయంలో పార్వతీపురం డివిజన్‌ వెనుకబడి ఉంది. ఈ డివిజన్‌లో సుమారు రూ.మూడు కోట్లు వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.కోటి 93 లక్షల వరకే వసూలు చేశారు. పాలకొండ డివిజన్‌లో మాత్రం రూ.2.67 కోట్లకు గాను రూ.కోటి 79 లక్షల వరకూ వసూలు చేశారు. అయితే ఇంటి పన్నుల వసూళ్లలో పాలకొండ డివిజన్‌ కాస్త ముందం జలో ఉంది. ‘ జిల్లాలో శతశాతం పన్ను వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంటి పన్నుల వసూళ్లలో ఎవరైనా నిరక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.’ అని డీపీవో కొండలరావు తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 12:21 AM