Share News

ఓబీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయండి’

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:14 AM

దేశంలోని 54 శాతం మంది ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

ఓబీసీలకు మంత్రిత్వశాఖ  ఏర్పాటు చేయండి’
మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు వరప్రసాద్‌ యాదవ్‌

పార్వతీపురం టౌన్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): దేశంలోని 54 శాతం మంది ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో నిర్వహించిన అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు వెళ్లాలంటే చట్టసభల్లో వారికి సముచిత స్థానం కల్పించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్‌ను పక్కా అమలు చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఎస్టీ, ఎస్టీ, మైనార్టీలకు ఎలా మంత్రిత్వ శాఖలను చట్టసభల్లో కల్పించారో అదే రీతిన ఓబీసీలకు అవకాశం కల్పించాలన్నారు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు.

కార్యవర్గం ఏకగ్రీవం

ఈ సందర్భంగా అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్వతీపురం జిల్లా అధ్యక్షుడిగా జి.రవి, ప్రధాన కార్యదర్శిగా బి.మధుయాదవ్‌, విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా బి.మహేశ్‌, ఉపాధ్యక్షుడిగా పి.గౌరీశంకర్‌ నాయుడు, జిల్లా కార్యదర్శిగా కె.సంతోష్‌లను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాలకు జాతీయ అధ్యక్షుడు వరప్రసాద్‌ యాదవ్‌, రాష్ట్ర ప్రధాన కార్య ర్శి ఎలగాపు విజయలక్ష్మి నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అలజంగి సత్యం, టి.రాము, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 12:14 AM