Share News

ఎన్నికల పోలింగ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలు

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:09 AM

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలీసు బలగాలతోపాటు ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలను కూడా వినియోగించుకోనున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

ఎన్నికల పోలింగ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలు
జామిలో పోలింగ్‌స్టేషన్‌ వద్ద బందోబస్తు పరిశీలిస్తున్న పోలీసులు :

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలీసు బలగాలతోపాటు ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలను కూడా వినియోగించుకోనున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

1,589 మందిపై బైండోవర్‌ కేసులు

వేపాడ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికల్లో ఎటువంటి అరాచకాలు, అల్లర్లు సృష్టించ కుండా ముందస్తు చర్యల్లో భాగంగా మూడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 1,589 మందిపై బైండోవర్‌ కేసులు నమో దుచేసినట్లు ఎస్‌.కోట రూరల్‌ సీఐ హిమగిరి తెలిపారు. బుధవారం మండలంలోని వల్లంపూడి పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎస్‌.కోట రూరల్‌ పరిధిలో 46 ఎంపీటీసీ, మూడు జడ్పీటీసీలకు గురువారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 174 బూతుల పరిధిలో 12 సమ స్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు.100 పోలిం గ్‌ లోకేషన్ల పరిధిలో అన్ని రాజకీయ పార్టీల నుంచి 1589 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఓటర్లను ఎవరైనా ప్రలోభాలుపెట్టినా, భయబ్రాంతులకు గురిచేసినా అటువంటివారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిను పురస్కరించుకొని 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 అమలులో ఉందని చెప్పారు.

650 మందిపై బైండోవర్‌ కేసులు

కొత్తవలస, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గురువారం జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 100 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు కొత్తవలస సీఐ టీవీ విజయ్‌ కుమార్‌ ఒక ప్రకట నలో తెలిపారు. పోలీసు బలగాలతో పాటు ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలను కూడా వినియోగించుకోనున్నట్లు పేర్కొ న్నారు. మొబైల్‌ స్క్వాడ్‌ సిబ్బందితోపాటు నాలుగు స్ర్టైకింగ్‌ఫోర్సులు, ఒక స్పెషన్‌ ర౅్టసౖకింగ్‌ ఫోర్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందస్తుగా 650 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు.

సమస్యాత్మక గ్రామాల్లో బైండోవర్‌ కేసులు

సంతకవిటి, నవంబర్‌ 4(ఆంధ్రజ్యోతి): సమస్యాత్మక గ్రామాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా వ్యక్తిగత బైండో వర్‌ కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ. రెండు లక్షల చొప్పున బైండోవర్‌ చేసినట్లు రాజాం రూరల్‌ సీఐ ఉపేం ద్రరావు తెలిపారు. బుధవారం సంతకవిటిలో విలేకరుల తో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను ప్రజలంతా క్రమ శిక్షణ, సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో విజయ వంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఓటువేసేందుకు పోలింగ్‌కేంద్రాలకు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఓటర్లు ఉన్నచోట సహనం పాటిస్తూ క్యూలో క్ర మపద్ధతిలో నిలబడాలని సూచించారు. ఎన్నికల సమ యంలో గొడవలకు పాల్పడితే చర్యలు తీసుకోవడంతో పాటు రౌడీషీట్లు తెరిచే అవకాశం ఉంటుందని హెచ్చరిం చారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌, సీసీ కెమె రాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. సీఐ ఆఽధ్వర్యంలో ప్రత్యేక పోలీసుబృందంతోపాటు మూడు స్ర్టైకింగ్‌ ఫోర్స్‌ బందాలు, డీఎస్పీ ఆధ్వర్యంలో నియోజకవ ర్గస్ధాయి ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొ న్నారు. ఎస్‌ఐలు అలీబేగ్‌, శ్రీరాములు, నీలావతి పోలీసు బందోబస్తుతో ఎన్నికల విధులు నిర్వహించనున్నట్లు పే ర్కొన్నారు. ఓటు వేసేందుకు వెళ్లే సమయంలో సెల్‌ఫోన్లు తీసుకురావద్దని, పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో వాహనాలు నిలపరాదని సూచించారు. వాటర్‌ ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లు తీసుకెళ్లరాదని, పార్టీ రంగులు, గుర్తులతో కూడిన స్టిక్కర్లు లేదా ప్రచార సామగ్రిని ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, పోలీసులు, పోలింగ్‌ అధికా రులకు సహకరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్త య్యేలా చూడాలని సీఐ ఉపేంద్రరావు కోరారు.

144,30 సెక్షన్ల అమలు

జామి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల దృష్ట్యా గురువారం పోలింగ్‌స్టేషన్ల వద్ద 144సెక్షన్‌ అమలులో ఉం దని సీఐ హిమగిరి పేర్కొన్నారు. బుధవారం మండలం లోని పలు గ్రామాల్లో గల పోలింగ్‌స్టేషన్లను ఎస్‌ఐ వైవీ జనార్దన్‌, సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భం గా సీఐ మాట్లాడుతూ సెక్షన్‌ 30 కూడా అమలవుతుం దని తెలిపారు. పోలింగ్‌స్టేషన్‌కు వందమీటర్ల అవతలే ఉండాలని సూచించారు. ఎవరైన ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలుచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Nov 05 , 2026 | 12:09 AM