సచివాలయాల్లో సర్వర్ సమస్య
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:19 AM
మండలంలోని పలు సచివాలయాల్లో సర్వర్ సమస్య వల్ల ఎన్టీఆర్ భరోసా పింఛన్‌కోసం దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు అగచాట్లకు గురవుతున్నారు.
సంతకవిటి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు సచివాలయాల్లో సర్వర్ సమస్య వల్ల ఎన్టీఆర్ భరోసా పింఛన్‌కోసం దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు అగచాట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు ఈనెల ఏడో తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకాగా 16వ తేదీలోగా పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సిఉంది. అయితే రెండు రోజులుగా సర్వర్ సక్రమంగా పనిచేయకపో వడంతో దరఖాస్తుదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు.