ఆరుతడి పంటలు సాగు చేయాలి
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:08 AM
జిల్లాలోని ఎల్‌నినో ప్రభావం వల్ల లోటు వర్షపాతం నమోదుకావడంతో రైతులు వరికి బదులుగా అపరా లు, ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవ సాయశాఖ జేడీ వీటీ రామారావు తెలిపారు. బుధవా రం విజయన గరంలోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
విజయనగరం, కలెక్టరేట్ ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎల్‌నినో ప్రభావం వల్ల లోటు వర్షపాతం నమోదుకావడంతో రైతులు వరికి బదులుగా అపరా లు, ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవ సాయశాఖ జేడీ వీటీ రామారావు తెలిపారు. బుధవా రం విజయన గరంలోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలోని ఎల్‌నినో ప్రభావంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణం కంటే 37.22 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. జూన్ నుంచి ఆగస్టు వరకూ జిల్లాలోని సాధారణంగా 455.9 మిల్లీమీటర్లు వర్షపా తానికి గాను ప్రస్తుతం 286.2 మిల్లీమాత్రమే నమోదై , మొత్తం 37.22 శాతం వర్షపాతం లోటు ఏర్పడిందని చె ప్పారు. తక్కువ వర్షపాతం నమోదైనా సాధారణ సాగు విస్తీర్ణం 1,23,608 హెక్టార్లకుగాను 59,337 హెక్టార్లు (63 శాతం) సాగైందని తెలిపారు. వరి 1,00,251 హెకార్లకు గాను ప్రస్తుతం 45,056 హెక్టార్లలో నాట్లు పడ్డాయని చెప్పారు. మొక్కజొన్న 7,746 హెక్టార్లు, నువ్వులు 2,416 హెక్టార్లు, ప్రత్తి 2,236 హెక్టార్ల సాగు నమోదయ్యిందని తెలిపారు. ఎల్‌నినో దృష్య్టా ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళిక రూపకల్పన చేశామని, దీనిలో భాగంగా 6245 క్వింటాల్ వివిధ విత్తనాలు సరఫరా కోసం ఇం డెంట్ పెట్టినట్లు చెప్పారు.
ప్రస్తుత పరిస్ధితుల్లో రైతుల పంటలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పం టలు బీమా చాలా అవసరమని జేడీ చెప్పారు. వరి, మొ క్కజొన్న సాగైన 52,802 హెక్టార్లలో ఇప్పటి వరకూ 35,096 హెక్టార్లకు (66.47) శాతం బీమా వర్తింపజేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఇప్పటి వరకూ 60,273 మంది రైతులు ఈ పఽథకం కింద నమోదు చేసుకున్నారని చెప్పారు. రైతులు తరపున రూ.172.71 లక్షలు ప్రీమియం మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపారు.