Share News

కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:03 AM

రాష్ట్రంలో రెండు చోట్ల ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించనున్న జూనియర్‌, సబ్‌ జూనియర్‌ బాలబాలికల కబడ్డీ జట్టుకు క్రీడాకారులను ఆదివారం ఎంపిక చేశారు.

కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

పాలకొండ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండు చోట్ల ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించనున్న జూనియర్‌, సబ్‌ జూనియర్‌ బాలబాలికల కబడ్డీ జట్టుకు క్రీడాకారులను ఆదివారం ఎంపిక చేశారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కబడ్డీ జిల్లా అసోసి యేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో డీఎస్పీ రాంబాబు, నగరపంచాయతీ కమిషనర్‌ కనకరాజు పాల్గొన్నారు. జూనియర్‌, సబ్‌ జూనియర్‌ బాలబాలికలు 226 మంది ఎంపికకు హాజరయ్యారు. ఇందులో సబ్‌ జూనియర్‌కు 48 మంది, జూనియర్‌ విభాగానికి 48 మందిని ఎంపిక చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీలు ఈ నెల 10 నుంచి 12 వరకు, మార్కాపురంలో జూనియర్‌ విభాగానికి సంబంధించి బాలబాలికల కబడ్డీ పోటీలు 16, 18 తేదీల మధ్య జరగనున్నట్టు కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కోడి సుధాకరరావు, కార్యదర్శి వెన్నపు శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Oct 05 , 2026 | 12:03 AM