సాఫ్ట్ బాల్ జిల్లా జట్ల ఎంపిక పూర్తి
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:46 PM
పారాది జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం సాఫ్ట్ బాల్ మెన్ అండ్ ఉమెన్ జిల్లా జట్ల ఎంపికలు జరిగాయి.
బొబ్బిలి రూరల్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): పారాది జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం సాఫ్ట్ బాల్ మెన్ అండ్ ఉమెన్ జిల్లా జట్ల ఎంపికలు జరిగాయి. సాఫ్ట్ బాల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బేబీనాయన ఆదేశాల మేరకు ఎంపికలు నిర్వహించినట్టు పీడీ నల్ల వెంకటనాయుడు తెలిపారు. ఎంపికైన జట్లు డిసెంబరు 12, 13, 14 తేదీలలో చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సీఈవో తుమ్మ సత్యనారాయణ, పీడీలు సత్యనారాయణ, ఎస్‌వీ నాయుడు, కిశోర్, శ్రీను, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.