Share News

పారాదిలో బేస్‌బాల్‌ జట్ల ఎంపిక

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:23 AM

మండలంలోని పారాది జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సాయా రమేష్‌, కార్యదర్శి విజయకుమార్‌ ఆధ్వర్యంలో జూనియర్స్‌, సబ్‌జూనియర్స్‌ సాఫ్ట్‌బాల్‌, సీనియర్స్‌ బేస్‌బాల్‌ జట్లను ఆదివారం ఎంపిక చేశారు.

  పారాదిలో బేస్‌బాల్‌ జట్ల ఎంపిక
జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్‌, బేస్‌బాల్‌ జట్ల ఎంపికైన క్రీడాకారులు

బొబ్బిలి రూరల్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని పారాది జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సాయా రమేష్‌, కార్యదర్శి విజయకుమార్‌ ఆధ్వర్యంలో జూనియర్స్‌, సబ్‌జూనియర్స్‌ సాఫ్ట్‌బాల్‌, సీనియర్స్‌ బేస్‌బాల్‌ జట్లను ఆదివారం ఎంపిక చేశారు. ఎంపికకు బొబ్బిలి, ఎస్‌.కోట, భోగాపురం, తోటపల్లి, బొడ్డవలస, కొట్టక్కి, తెర్లాం, పెరుమాళి, బాడంగి, రామభద్రపురం తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన సబ్‌జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టు బొబ్బిలిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుండగా జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టు ఆక్టోబర్‌లో కడపలో జరిగే రాష్ట్రస్ఠాకి పోటీల్లో పాల్గొంటుంది. సీనియర్‌ బేస్‌బాల్‌ జిల్లా జట్టు కూడా కడపలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందిస్తూ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఆధ్వర్యంలో జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ముందుకు సాగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఇదే క్రమంలో నూతనంగా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా శంకర్‌ ఎన్నికయ్యారు. జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. కార్యక్రమంలో సెలక్షన్‌ కమిటీ సభ్యులు సత్యనారాయణ, వెంకటినాయుడు, కిషోర్‌, అప్పలనాయుడు, శివ, అనిల్‌కుమార్‌, పాల్గొని జట్టలను ఎంపిక చేశారు.

Updated Date - Aug 31 , 2026 | 12:23 AM