Share News

వాహనాల సీజ్‌.. మద్యంపై నిఘా

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:11 AM

జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పలుచోట్ల మంగళవారం కార్డన్‌సెర్చ్‌ నిరహించారు.ఈసందర్భంగా అనుమ తిలేని ద్విచక్రవాహనాలను సీజ్‌చేశారు. మద్యం రవాణాపై కూడా నిఘా పెంచారు.

 వాహనాల సీజ్‌.. మద్యంపై నిఘా
భోగాపురం: దల్లిపేటలో తనిఖీలు నిర్వహిస్తున్న సీఐ రవికుమార్‌ :

జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పలుచోట్ల మంగళవారం కార్డన్‌సెర్చ్‌ నిరహించారు.ఈసందర్భంగా అనుమ తిలేని ద్విచక్రవాహనాలను సీజ్‌చేశారు. మద్యం రవాణాపై కూడా నిఘా పెంచారు.

నాలుగు ద్విచక్రవాహనాలు..

భోగాపురం,నవంబరు17(ఆంధ్రజ్యోతి): చట్టవ్యతిరేకంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు పాల్పడినా చర్యలు తప్పవని సీఐ రవికుమార్‌ హెచ్చరించారు. మంగళవారం ఉదయం గూడెపువలస, దల్లిపేట, బైరెడ్డిపాలెం పంచాయతీల్లో పం చాయతీ ఎన్నికల నేపద్యంలో కార్డెన్‌సెర్చ్‌ కార్యకమ్రంలో భాగంగా తనిఖీలు చేప ట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా ఈకార్యకమ్రం నిర్వహించినట్లు తెలిపారు.ఈమేరకు గ్రామాల్లో ప్రజలు అనుమతితో గృహాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలుచేపట్టారు. వాహనాల రికార్డులు పరిశీలించి ఆధారాలు లేని వాహనాలను సీజ్‌చేశారు. కార్యకమ్రంలో ఎస్‌ఐలు రమేష్‌, రామారావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బెల్లు షాపుపై దాడి

భోగాపురం మండలంలోని చోడిపల్లిపేటలో బెల్ట్‌షాపుపై దాడిచేసి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.రవికుమార్‌ మంగళవారం తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావ డంతో సిబ్బందితో కలిసి దాడిచేసి ఆరు బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

రికార్డులేని వాహనాలు..

గజపతినగరం, నవంబరు17(ఆంధ్రజ్యోతి): రికార్డులేని ఐదుమోటారు వాహనాల ను సీజ్‌చేసినట్లు సీఐ సన్యాసినాయుడు తెలిపారు. మండలంలోని ఎన్‌జీఆర్‌పురం లో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. 20 మంది సిబ్బందితో గ్రామంలో కార్డెన్‌సెర్చ్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిం చారు. అపరిచితులు గ్రామాల్లో పర్యటిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అంద జేయాలని సూచించారు. రికార్డులు లేని వాహనాలతోపాటు గ్రామాల్లో ఎన్నికల నిర్వ హణ ముగిసే వరకు అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సాయంత్రం నాకాబందిలో భాగంగా వాహ నాలు తనిఖీచేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు పాల్గొన్నారు.

మద్యం నిలువరించేందుకు తనిఖీలు

గుర్ల, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రానున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. ఈ మేరకు గుర్ల ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదును నిలువరించేందుకు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుం డా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

Updated Date - Nov 18 , 2026 | 12:11 AM