క్రికెట్ టోర్నీ విజేత ‘సీతంపేట’
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:18 AM
ఎన్‌జేకే క్రికెట్ ప్రీమియం లీగ్ టోర్నమెంట్ విజేతగా సీతంపేట జట్టు నిలిచింది.
వీరఘట్టం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ఎన్‌జేకే క్రికెట్ ప్రీమియం లీగ్ టోర్నమెంట్ విజేతగా సీతంపేట జట్టు నిలిచింది. స్థానిక మరియగిరి సెంటర్‌లోని మైదానంలో ఎన్‌జేఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం బిటివాడ, సీతంపేట జట్లు మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అందులో సీతంపేట విజేతగా నిలిచింది. విజేత జట్టుకు జట్టుకు చాంపియన్ ట్రోఫీతో పాటు రూ. 50 వేలు నగదు బహుమతిని ఎమ్మెల్యే జయకృష్ణ ప్రదానం చేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన బిటివాడ జట్టుకు రూ.30 వేలు, ఉత్తమ ప్రతిభ చూపిన భామిని, బత్తిలి జట్లకు రూ.10 వేలు చొప్పున అందజేశారు. కార్యక్ర మంలో నిమ్మక పాండురంగారావు, కర్నేన అప్పలనాయుడు, ఉదయాన ఉదయ్‌భాస్కర్, గర్భాన సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.