See you again friend.. మళ్లీ కలుద్దాం మిత్రమా..
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:29 AM
See you again friend.. జీవితంలో మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలు ఎదుర్కొని విజయవంతంగా ముగిసిన ఆనందంలో ఉన్న ఆ విద్యార్థులు స్నేహితులను వీడుతున్నందుకు బాధపడ్డారు.
మళ్లీ కలుద్దాం మిత్రమా..
టెన్త్ పరీక్షలు ముగిసినందుకు విద్యార్థుల్లో ఆనందం
స్నేహితులను వీడుతున్నందుకు బాధ
విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి):
జీవితంలో మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలు ఎదుర్కొని విజయవంతంగా ముగిసిన ఆనందంలో ఉన్న ఆ విద్యార్థులు స్నేహితులను వీడుతున్నందుకు బాధపడ్డారు. ఓ వైపు ఎండ మండుతున్నా మిత్రులతో మాటలు ఆపేందుకు ఇష్టపడలేదు. అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు రాసుకుని మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుండాలని, ఎప్పుడూ స్నేహాన్ని మరిచిపోవద్దని, ఎక్కడున్నా బాగుండాలని కోరుకుటూ బయలుదేరారు. భారమైన హృదయాలతో టాటా చెప్పుకున్నారు. టెన్త్ పరీక్షలు ముగిసిన సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద గురువారం మధ్యాహ్నం విద్యార్థినీవిద్యార్థుల్లో కనిపించిన భావోద్వేగ దృశ్యాలివి. జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. చివరి రోజు 22,938 మంది విద్యార్థులు పరీక్ష రాయల్సి ఉండగా 55 మంది గైర్హాజరయ్యారు. గత నెల 16న మొదలైన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజున కలెక్టర్ రామసుందర్ రెడ్డి, డీఈవోతో పాటు స్క్వాడ్ బృందాలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి.