టీడీపీ నేత దుర్భాషలపై కార్యదర్శుల నిరసన
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:09 AM
మండలంలోని చిన్నశిర్లాం పంచాయతీ కార్యదర్శి వి.బిందుశేఖర్‌ను ఇదే గ్రామ టీడీపీ నేత, తెలుగు యువత మండల అధ్యక్షు డు మజ్జి శ్రీనివాసరావు అసభ్య పదజాలంతో దుషించ టంపై మండల పంచాయతీ కార్యదర్శుల అసోసియేష న్ తీవ్రంగా ఖండించింది.
రేగిడి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నశిర్లాం పంచాయతీ కార్యదర్శి వి.బిందుశేఖర్‌ను ఇదే గ్రామ టీడీపీ నేత, తెలుగు యువత మండల అధ్యక్షు డు మజ్జి శ్రీనివాసరావు అసభ్య పదజాలంతో దుషించ టంపై మండల పంచాయతీ కార్యదర్శుల అసోసియేష న్ తీవ్రంగా ఖండించింది. యూనియన్ ప్రతినిధులు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాల యం ముందు కాసేపు బైఠాయించి, నిరసన తెలిపారు. ఉద్యోగులపై మానసిక, రాజకీయ వేధింపులు తగవని హెచ్చరించారు. వీరికి మండల పరిషత్ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు.
భోగాపురం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): రేగిడి మండలం చిన్నశిర్లాం పంచాయతీ కార్యదర్శిపై ఓ టీడీపీ నేత దుర్భాషలాడ డాన్ని ఖండిస్తున్నామని భోగాపురం మండల కార్యద ర్శుల నాయకుడు సీహెచ్ అచ్యుతరావు అన్నారు. ఈమేరకు మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాల యం ఎదుట కార్యదర్శులతో నిరసన తెలిపారు.