సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలి
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:30 AM
మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని కమిషనర్ ఎ.రామచంద్రరావు ఆదేశించారు.
రాజాం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని కమిషనర్ ఎ.రామచంద్రరావు ఆదేశించారు. శనివారం కొండంపేట, సత్యన్నారాయణపురం, లచ్చయ్యపేట వార్డు సచివాలయాలను ఆయన సందర్శించి ఉద్యోగులు హాజరును తనిఖీ చేశారు. వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాల యాల పరిధిలో తాగునీటి సరఫరా, విద్యుత్, పారిశుధ్య సేవలు పరిశీలించాలన్నారు. ఈ విభాగాల్లో ఎక్కడైనా సమస్య వస్తే సంబంధిత అధికారికి గాని, తనకు గాని తెలియజేయాలన్నారు. ఇంటి పన్ను, కుళాయి పన్నుల వసూళ్ల విషయంలో జాప్యం చేయవద్దన్నారు. పన్నులు వసూళ్లలో నిర్లక్ష్యం చేసినా, సమయపాలన పాటించక పోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.