But Prices Refuse to Rise! సీజన్ ముగుస్తున్నా.. ధర పెరగట్లే!
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:20 PM
Season Ends, But Prices Refuse to Rise! సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతులు పండించే పుల్లదబ్బకు డిమాండ్ తగ్గింది. గత వారంతో పోల్చుకుంటే ఒక్కో పండు ధర రూ.2 వరకు తగ్గింది. సీతంపేట వారపుసంతలో గత వారం పుల్లదబ్బ పండు ధర రూ.5వరకు పలకగా ఈ వారం ఒక్కో పండు ధర రూ.2 నుంచి రూ.3వరకు మాత్రమే అమ్ముడిపోయింది. దీంతో గిరిజన రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఆందోళనలో గిరిజన రైతులు
సీతంపేట, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతులు పండించే పుల్లదబ్బకు డిమాండ్ తగ్గింది. గత వారంతో పోల్చుకుంటే ఒక్కో పండు ధర రూ.2 వరకు తగ్గింది. సీతంపేట వారపుసంతలో గత వారం పుల్లదబ్బ పండు ధర రూ.5వరకు పలకగా ఈ వారం ఒక్కో పండు ధర రూ.2 నుంచి రూ.3వరకు మాత్రమే అమ్ముడిపోయింది. దీంతో గిరిజన రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ పుల్లదబ్బకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ర్టాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పచ్చళ్ల తయారీ కోసం ఆయా ప్రాంతవాసులు దానిని ఉపయోగిస్తుంటారు. దీంతో ఈప్రాంతంలో గిరిజనులు పండించే పుల్లదబ్బకు డిమాండ్ ఉన్నప్పటికీ.. ధర మాత్రం పలకకపోవడంతో గిరిజన రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పుల్లదబ్బతో పాటు నారింజ పండ్లు కేటు ధర కూడా రూ.200 నుంచి రూ.300మాత్రమే పలుకుతోంది. గత వారం నారింజ పండ్ల ఒక్కో కేటు ధర రూ.500కు పైగా పలికింది. సీజన్ ముగుస్తున్నా.. ధర పెరగకపోవడంపై గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉండగా మైదాన ప్రాంత వ్యాపారులందరూ సిండికేట్‌గా మారి.. ఒకే ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ పంటలను తక్కువ ధరకు వారికే విక్రయించాల్సి వస్తోందని గిరిజన రైతులు వాపోతున్నారు. దీనిపై ఐటీడీఏ అధికారులు దృష్టిసారించాలని వారు కోరుతున్నారు.