మొదటి విడత నామినేషన్ల పరిశీలన
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:42 PM
Scrutiny of First-Phase Nominations జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పరిశీలన ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు సర్పంచ్, వార్డు సభ్యుల పత్రాలను క్షుణ్నంగా పరిశీలించారు. కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది పంచాయతీల నుంచి సర్పంచ్ పదవులకు 1,182, వార్డు సభ్యులకు 4,011 నామినేషన్లు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్ కేంద్రాలకు తరలిరాగా.. వారి సమక్షంలోనే పత్రాలను పరిశీలించారు.
పార్వతీపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పరిశీలన ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు సర్పంచ్, వార్డు సభ్యుల పత్రాలను క్షుణ్నంగా పరిశీలించారు. కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది పంచాయతీల నుంచి సర్పంచ్ పదవులకు 1,182, వార్డు సభ్యులకు 4,011 నామినేషన్లు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్ కేంద్రాలకు తరలిరాగా.. వారి సమక్షంలోనే పత్రాలను పరిశీలించారు. కురుపాం మండలంలో ఒకటి, సీతానగరం 12, పార్వతీపురం ఒకటి, గరుగుబిల్లిలో ఐదు నామినేషన్లు తిరస్కారానికి గురయ్యయి. ఆయా అభ్యర్థులు అప్పీళ్లకు వెళ్లే అవకాశం ఉంది. ఈనెల 21న మధ్యాహ్నం మూడు గంటల్లోపు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదేరోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. పోటీలో ఉండే అభ్యర్థులకు గుర్తును కేటాయిస్తారు. అవే గుర్తులతో అభ్యర్థులు ప్రచారాలు నిర్వహిస్తారు. ఈ నెల 26న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా మొదటి దశలో 3.46 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు.
రెండో విడత పల్లెపోరు ప్రారంభం
పాలకొండ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పల్లెపోరు ప్రారంభమైంది. పాలకొండ నియోజకవర్గంలోని పంచాయతీల్లో బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు సర్పంచ్‌కు 59, వార్డు మెంబర్లకు 104 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. సర్పంచ్ పదవికి పాలకొండ మండలంలో ఏడు, భామిని 18, సీతంపేట 19, వీరఘట్టం మండలంలో 15 చొప్పున నామినేషన్లు వచ్చాయి. వార్డు సభ్యులకు పాలకొండ మండలం 11 , భామిని 38 , సీతంపేట 26 , వీరఘట్టం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 21న పరిశీలన , 22న అప్పీలు , 23న అప్పీళ్ల పరిష్కారం, 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. మొత్తంగా 146 పంచాయతీలు, 832 వార్డులకు 29న పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. కాగా లక్షా 72 వేల 953 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.