Share News

Scorching Heatwave మండుతున్న ఎండలు

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:38 AM

Scorching Heatwave జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాలేకపోతున్నారు.

Scorching Heatwave మండుతున్న ఎండలు
మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిర్మానుష్యంగా పాలకొండ ప్రధాన రహదారి

పాలకొండ, ఏప్రిల్‌3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు మధ్యాహ్నం వేళల్లో ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 40డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు తదితర ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనెల మొదటి వారంలోనే ఇలా ఉంటే.. ఇక మేనెలలో పరిస్థితేమిటోనని ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా మరో రెండు రోజుల పాటు భగభగలు తప్పవని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతేనే బయటకు రావాలని, ఓఆర్‌ఎస్‌ ద్రావణం లాంటివి అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 12:38 AM