Scorching Heat Intensifies ఠారెత్తిస్తున్న ఎండలు
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:36 AM
Scorching Heat Intensifies జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం ఐదు గంటల వరకు ఎండ వేడి, వడగాడ్పుల తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ప్రజలు విలవిల
సాలూరు రూరల్; ఏప్రిల్13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం ఐదు గంటల వరకు ఎండ వేడి, వడగాడ్పుల తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం 40డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో ఎండ మండింది. జిల్లావాసులు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. దీంతో మధ్యాహ్నం వేళ ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. కాగా రానున్న రెండు రోజుల పాటు 15 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశా లున్నాయని ఏపీఎస్‌డీఎంఏ సూచించింది. ఈ నెల 20 వరకు ఎండలు మండే అవకాశాలు అధికమని ఐఎండీ ప్రకటించింది. పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీలు దాటనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని, పాడిపశువులపై ప్రత్యేక దృష్టిసారించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.