Share News

Scorching Heat మండుతున్న ఎండలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 11:46 PM

Scorching Heat జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత భానుడు తన ప్రతాపం చూపుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో మున్ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని భయాందోళన చెందుతున్నారు.

Scorching Heat   మండుతున్న ఎండలు
మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిర్మానుష్యంగా పాలకొండ ప్రధాన రహదారి

పాలకొండ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత భానుడు తన ప్రతాపం చూపుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో మున్ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 38 డిరగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లోనూ ఎండ ఠారెత్తించింది. దీంతో ప్రజలు సాయంత్రం వరకూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రధాన రోడ్లు, కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. వాస్తవంగా ఫిబ్రవరి నెల రెండో వారం వరకు కనిష్టంగా 13 డిగ్రీలు, గరిష్టంగా 23 డిగ్రీల వరకు జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ప్రస్తుతం కనిష్టం 25 డిగ్రీలు, గరిష్టంగా 38 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ సారి అంతకుమించి నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 11:46 PM