Schools విద్యాలయాల రుణం తీర్చుకోవాలి
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:14 AM
Schools Must Repay Loans ఓనమాలు నేర్పి.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడిన విద్యాలయాల రుణం ప్రతిఒక్కరూ తీర్చుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రెండో రోజు బత్తిలి జడ్పీ హైస్కూల్‌లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు.
భామిని, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఓనమాలు నేర్పి.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడిన విద్యాలయాల రుణం ప్రతిఒక్కరూ తీర్చుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రెండో రోజు బత్తిలి జడ్పీ హైస్కూల్‌లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు ఏదో ఒక విధంగా సహా యపడి పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములవ్వాలన్నారు. తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తే, పాఠశాల విజ్ఞానం అందించి భవిషత్య్‌ను తీర్చిదిద్దుతుందని తెలిపారు. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా తల్లిదండ్రులు, పాఠశాలను మరువరాదన్నారు. 2030లో నిర్వహించనున్న అంతర్జాతీయ కామన్ వెల్త్ గేమ్స్‌లో జిల్లా విద్యార్థులు పాల్గొనేలా కృషి చేయాలని సూచించారు. మారుమూల ప్రాంతంలో ఉన్న బత్తిలి హైస్కూల్ వజ్రోత్సవం జరుపుకోవడం గొప్ప విషమన్నారు. ముస్తాబు కార్యక్రమంతో విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ముందుగా కలెక్టర్ పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు వజ్రోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. ఏడు పదులు వయసు దాటిన వారు కూడా విద్యార్థి అవతారం ఎత్తి సరదాగా గడిపారు. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుని నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.