Share News

వాడవాడలా బడి పండగ

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:59 AM

జిల్లాలో మెగా పేరెంట్స్‌ - టీచర్స్‌ సమావేశాలు శుక్రవారం పండగ వాతావర ణంలో జరిగాయి.

వాడవాడలా బడి పండగ
దత్తిరాజేరు: కేజీబీవీలో పిల్లలను ఆశీర్వదిస్తున్న తల్లులు

  • ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్‌- టీచర్స్‌ సమావేశాలు

విజయనగరం, కలెక్టరేట్‌ జూలై 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మెగా పేరెంట్స్‌ - టీచర్స్‌ సమావేశాలు శుక్రవారం పండగ వాతావర ణంలో జరిగాయి. అన్ని ప్రభుత్వం పాఠశాల ల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సా గిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లి దం డ్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముం దుగా మెగా పీటీఎం ఆవశక్యతను విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు వి వరించారు. జిల్లాలోని 1,790 పాఠశాలలు, ప్రభుత్వ జూ నియర్‌ కాలేజీల్లో నిర్వహిం చగా.. 1,21,486 మంది విద్యార్థులు, 1,13,142 మంది తల్లిదం డ్రులు, 8857 మంది ఉపాధ్యా యులు, 23,155 మంది పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, 1,408 మంది పూర్వ విద్యా ర్థులు, 856 మంది దాతలు, 2596 మంది ప్రజా ప్రతినిధులు, 826 మంది అధికారులు, 2,985 ఇతర అధికారులు పాల్గొన్నారు. అనం తరం స్దానిక శాసనసభ్యులు, విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం అమ లు చేస్తున్న తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ, విద్యార్థిమిత్ర వంటి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత విద్యా సంవత్సరంలో పది పబ్లిక్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను నగదు బహుమతి అందజేసి శాలువాతో స త్కరించారు. కార్య క్రమంలో డీఈవో మూణి క్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 01:00 AM