School bus overturns in Tunivada తునివాడలో స్కూల్ బస్సు బోల్తా
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:31 AM
School bus overturns in Tunivada తునివాడ గ్రామం నుంచి మంగళవారం ఉదయం బయలుదేరిన ఒక ప్రైవేటు బస్సు కొద్దిక్షణాల్లోనే ప్రమాదానికి గురైంది. గ్రామసమీపంలో బ్రేక్‌లు ఫెయిలై వరిపొలంలోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. ఆ సమయంలో బస్సులో ఆరుగురు పిల్లలు ఉండగా ఎవరికి ప్రాణాపాయం లేదు.
తునివాడలో స్కూల్ బస్సు బోల్తా
బ్రేక్ ఫెయిలై వరి పొలంలోకి దూసుకెళ్లిన వైనం
ఓ బాలికకు తీవ్రగాయాలు
క్షేమంగా బయటపడిన పిల్లలు
రేగిడి, ఆగస్టు25(ఆంధజ్యోతి): తునివాడ గ్రామం నుంచి మంగళవారం ఉదయం బయలుదేరిన ఒక ప్రైవేటు బస్సు కొద్దిక్షణాల్లోనే ప్రమాదానికి గురైంది. గ్రామసమీపంలో బ్రేక్‌లు ఫెయిలై వరిపొలంలోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. ఆ సమయంలో బస్సులో ఆరుగురు పిల్లలు ఉండగా ఎవరికి ప్రాణాపాయం లేదు. చిన్నచిన్న గాయాలయ్యాయి. దీంతో గ్రామస్థులు, కుటుంబీకులు ఊపిరి పీల్చుకొన్నారు. సైడ్‌విండోలో కూర్చొన్న 9వ తరగతి విద్యార్థిని పల్లె మిధునశ్రీ కాళ్లు ఇరుక్కుపోయాయి. సమీపంలో ఉన్న గ్రామస్థులు పరుగున వచ్చి బాలికను బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఎక్సలేటర్ సహాయంతో బస్సు ఎత్తి ఆమెను కాపాడారు. బాలిక కాళ్ల వద్ద తీవ్ర గాయమైంది. రాజాం ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ప్రమాదానికి బస్సు కండిషన్ బాగోలేకపోవటం, స్టీరింగ్ పట్టేయడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమాచారంపై ఎంఈవో వరప్రసాదరావు స్పందించి ఆరా తీశారు. రేగిడి పోలీసులు బస్సు వద్దకు చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. పిల్లలకు పెద్ద ప్రమాదం తప్పడంపై తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.