Saving the Lives క్షతగాత్రుల ప్రాణాలు నిలిపేలా!
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:56 PM
Saving the Lives of the Injured! రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ (రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్, హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్‌మెంట్ )పథకం వరంలా మారింది. క్షతగాత్రులకు నగదు రహిత వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేస్తున్నాయి. కాగా బాధితులకు గోల్డెన్ ఆవర్ (ప్రమాదం జరిగిన స్వల్ప వ్యవధిలో)లో వైద్య సేవలు అందించి.. ప్రాణాపాయం నుంచి గట్టెక్కించడమే ఈ పథకం లక్ష్యం.
ఆసుపత్రుల్లో తక్షణ నగదు రహిత వైద్య సేవలు
నూతన పథకం.. బాధితులకు వరం
సాలూరు రూరల్, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ (రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్, హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్‌మెంట్ )పథకం వరంలా మారింది. క్షతగాత్రులకు నగదు రహిత వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేస్తున్నాయి. కాగా బాధితులకు గోల్డెన్ ఆవర్ (ప్రమాదం జరిగిన స్వల్ప వ్యవధిలో)లో వైద్య సేవలు అందించి.. ప్రాణాపాయం నుంచి గట్టెక్కించడమే ఈ పథకం లక్ష్యం. క్షతగా త్రులను ఆసుపత్రికి తీసుకెళ్లిన వెంటనే పీఎం రాహత్ పథకంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుప త్రులు గరిష్టంగా ఏడు రోజులు లేదా రూ. 1.5 లక్షల విలువైన వైద్య సేవలు నగదు రహితంగా అందిస్తారు. బాధితుని ఆర్థిక స్థోమత, నివాసం, ప్రదేశంతో సంబంధం లేదు. హిట్ అండ్ రన్ కేసులు, బీమా లేని వాహనా లకు సైతం ఈ పథకం వర్తిస్తుంది. బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లిన వారికి పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. పోలీస్ వాలిడేషన్ ద్వారా చికిత్స అందించిన ఆసుపత్రికి ట్రస్ట్ ద్వారా చెల్లిం పులు జరగనున్నాయి. ఇందుకు పోలీసులు ప్రమాద విషయాలు, బాధితుని చికిత్స తదితర వివరాలను ఈడర్ (ఈ డీఏఆర్ ) పోర్టల్ రిపోర్ట్ చేస్తారు.
ఉమ్మడి జిల్లాలో ..
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏవోబీ బోర్డర్ నుంచి రాజాపులోవ జంక్షన్ వరకు 26 నెంబరు జాతీయ రహదారి ఉంది. ఏపీ ఘాట్ రోడ్‌లో గతేడాది 17 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఏడుగురు మరణించగా మరో 17 మంది గాయపడ్డారు. ఇక రాజాం నుంచి కునేరు వరకు రాష్ట్రీయ రహదారి ఉంది. ఈ మార్గంలో పలు ప్రమాదాలు సంభవించాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏడాదికి సగటున 250కి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2024లో జిల్లాలో 248 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 71 మంది మరణించారు. గతేడాది 259 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 108 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. విజయనగరం జిల్లాలో గతేడాది (2025) 618 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 199 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఇటువంటి సందర్భాలలో క్షతగాత్రులకు పీఎం రాహత్ పథకం అండగా నిలుస్తుంది. కాగా ఇటీవల చినభోగిల వద్ద రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రుడిని మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లి సకాలంలో వైద్య సేవలు అందేలా చేశారు. ప్రాణాపాయం తప్పించారు. ఇదే సమయంలో పీఎం రాహత్ పథకం గురించి వివరించి.. రోడ్డు ప్రమాద బాధితులను ఆదు కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అమలు ఇలా..
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏడు ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పీఎం రాహత్ పథకం అమలులోకి వచ్చింది. పీఎం రాహత్‌లో బాధితులకు తక్షణ చికిత్స అందించ డానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందు కోసం ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని సైతం ఏర్పాటు చేసింది. బాధితునికి రూ.1.5 లక్షల వరకు చికిత్స అందించిన ఆసుపత్రులకు పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం ( పీఎఫ్‌ఎంఎస్ )లో చెల్లింపులు చేయనున్నారు. దీనిపై డీసీహెచ్‌ఎస్ నాగభూషణరావును వివరణ కోరగా.. ‘రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం కింద రూ.1.5 లక్షల విలువైన వైద్య సేవలు అందిస్తాం. క్షతగత్రుల్లో ఎవరికైనా రూ.1.5 లక్షలు సరిపోకుంటే, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు కింద వైద్యసేవలు అందిస్తాం. జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో ఈ పథకం అమలులోకి వచ్చింది. బాధితులకు తక్షణ వైద్యసేవలందిస్తే 50 శాతం వరకూ మరణాలు తగ్గే అవకాశం ఉంది. ’ అని తెలిపారు.