Share News

సంకిలి కర్మాగారాన్ని కాపాడండి

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:32 AM

సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారాన్ని కాపాడాలని కోరుతూ పరిశ్రమ పరిరక్షణ కమిటీ సభ్యులు సోమవారం కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో జేసీ ఎస్‌.మాధవన్‌కు వినతిపత్రం అందజేశారు.

సంకిలి కర్మాగారాన్ని కాపాడండి

  • కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో వినతి

రేగిడి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారాన్ని కాపాడాలని కోరుతూ పరిశ్రమ పరిరక్షణ కమిటీ సభ్యులు సోమవారం కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో జేసీ ఎస్‌.మాధవన్‌కు వినతిపత్రం అందజేశారు. సూపర్‌ ఎల్‌నినో సాకు చూపించి 2027-28 క్రషింగ్‌ సీజన్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించడంపై ఉమ్మడి జిల్లాల చెరకు రైతులు వ్యతిరేకిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. ఆయన వెంట పరిరక్షణ కమిటీ సభ్యులు చింత సంగంనాయుడు, నిష్ఠల సూర్యప్రకాష్‌ గుప్తా, గురాన కార్తీక్‌, పి.నాగశెట్టి తదితరులు ఉన్నారు. వీటిపై స్పందించిన జేసీ.. ఉమ్మడి జిల్లాల రైతులు, ప్రజాప్రతినిధుల, యాజమాన్యంతో జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి, కర్మాగారం పది కాలలు ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - Sep 08 , 2026 | 12:32 AM