Share News

సమాజసేవతోనే సంతృప్తి

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:22 AM

సమాజ సేవతోనే సంతృప్తి లభిస్తుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.

సమాజసేవతోనే సంతృప్తి
పరిశినాయుడుకు పురస్కారాన్ని అందిస్తున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

గరుగుబిల్లి, జనవరి12 (ఆంధ్రజ్యోతి): సమాజ సేవతోనే సంతృప్తి లభిస్తుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం తోటపల్లి జట్టు ట్రస్ట్‌ కార్యాలయంలో సమాజ సేవ, పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురికి జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేవాభావంతో ముందుకు సాగి సమాజంలో సానుకూల మార్పుకు కృషి చేయాలన్నారు. జట్టు సంస్థ అమలు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న డాక్టర్‌ డి.పారినాయుడును అభినందించారు. అనంతరం స్వామి వివేకా నంద చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో కృషి చేసిన నఖ చిత్రకారుడు పల్ల పరిశినాయుడు, రంగస్థల కళాకారిణి కె.మంగాదేవి, విజ్ఞానానికి సంబంధించి టి.శివకేశవరావు, రంగస్థల కళాకారుడు యడ్ల గోపాలరావులకు జీవిత సాఫల్య పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో తోటపల్లి దేవ స్థానం చైర్మన్‌ ఎం.పకీరునాయుడు, ఎంపీటీసీ సభ్యుడు ఎం.సింహాచలంనాయుడు, ప్రజా కవి రౌతు వాసేదేవరావు, జట్టు ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ డి.పారినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 12:22 AM