Share News

పారదర్శకంగా ‘సర్‌’

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:33 AM

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పారదర్శంగా జరుగుతుందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

పారదర్శకంగా ‘సర్‌’
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, జూలై 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పారదర్శంగా జరుగుతుందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1032 మంది బీఎల్‌వోల ఆధ్వర్యంలో వంద శాతం ఎన్యూ మరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయిందన్నారు. 7,90,562 మంది ఓటర్లలో ఇప్పటివరకు 5,19,972 ఫారాలు డిజిటలైజ్‌ చేసి 65.11 శాతం ప్రగతి సాధించినట్టు వెల్లడించారు. ఈ ప్రక్రియలో పాలకొండ 70.37 శాతంతో మొదటి స్థానంలో ఉందన్నారు. కురుపాంలో 69.48 శాతం, సాలూరు 61.73 శాతం, పార్వతీపురం 61.61 శాతం మేర డిజిటలైజేషన్‌ జరిగినట్లు వివరించారు.

విద్యా ప్రమాణాలు, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు విద్యార్థుల శారీరక దృఢత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరు పాఠశాలల పర్యవేక్షణ, పరిశు భ్రత, మధ్యాహ్న భోజనం, క్రీడలు, మౌలిక వసతులపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు వారానికి కనీసం ఒక రోజు పరుగు, మిగతా రోజుల్లో క్రీడల్లో పాల్గొనేలా చూడాలని సూచించారు. ప్రతి పీరియడ్‌ అనంతరం స్ర్టెచింగ్‌ వ్యాయామాలు చేయించాలన్నారు నెలవారీ ఫిట్‌నెస్‌ పరీక్షలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

- అంగన్‌వాడీ సేవలు, పోషకాహార సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. బాల సంజీవిని కిట్ల పంపిణీ వెంటనే పూర్తి చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడంతో పాటు చిన్నారుల ఆధార్‌, ఆరోగ్య గుర్తింపు వివరాలు ధ్రువీకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు.

Updated Date - Jul 08 , 2026 | 10:52 AM