Sankranti before ముందే సంక్రాంతి శోభ
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:32 AM
Sankranti beauty before ముత్యాల ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. భారీగా మహిళలు తరలివచ్చారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్ బై: సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ.. ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఆనందగజపతి కళాక్షేత్ర ప్రాంగణంలో జరిగిన ఈ పోటీలతో సంక్రాంతి శోభ ఉట్టిపడింది. లోకల్ స్పాన్సర్‌గా ‘విజయనగరం సుఖీభవ హాస్పిటల్ వారు వ్యవహరించారు.
ముందే సంక్రాంతి శోభ
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన
అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళలు
ముగ్గు వేసిన ఎమ్మెల్యే అదితి
విజయనగరం బృందం, జనవరి 3(ఆంధ్రజ్యోతి):
ముత్యాల ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. భారీగా మహిళలు తరలివచ్చారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్ బై: సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ.. ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఆనందగజపతి కళాక్షేత్ర ప్రాంగణంలో జరిగిన ఈ పోటీలతో సంక్రాంతి శోభ ఉట్టిపడింది. లోకల్ స్పాన్సర్‌గా ‘విజయనగరం సుఖీభవ హాస్పిటల్ వారు వ్యవహరించారు. పోటీల్లో 117 మంది పాల్గొని వారికి కేటాయించిన గదుల్లో ముగ్గులు వేశారు. వాటిలో సంక్రాంతి కళ కనిపించింది. మధ్యలో గొబ్బెమ్మలతో పాటు పల్లె సాంస్కృతిని ప్రతిబింబించేలా నాటుబళ్లు, బూరెలు, అరిసెలు, చిరుధాన్యాలు, తోలుబొమ్మలు, తిరగళ్లు, రోళ్లు, వరి కుంకులు వంటివి ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ పోటీలు రెండు గంటల పాటు సాగాయి. పోటీలను విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తాను కూడా ఓ ముగ్గుకు సహకారం అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలుగు సాంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం రంగవల్లులేనని, ఇటువంటి సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తాను కూడా చిన్నప్పుడు చుక్కల ముగ్గులు వేశానని, ముగ్గులు వేసేవారిలో మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు గణితంలో మంచి పట్టు సాధిస్తారని చెప్పారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
పోటీల్లో పాల్గొన్న మహిళలందరూ తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించి ఆకట్టుకునేలా ముగ్గులు వేశారు. వీటిలో న్యాయనిర్ణేతలు ముగ్గురిని ఎంపిక చేశారు. నెల్లిమర్లకు చెందిన టి.సింధూజ ప్రథమ బహుమతి సాధించారు. విజయనగరానికి చెందిన ఆర్.ప్రవీణ రెండో బహుమతి, విజయనగరం రౌతు వీధికి చెందిన ఎం.రాజు మూడో బహుమతి సొంతం చేసుకున్నారు. వీరికి ఆర్‌డీవో దాట్ల కీర్తి, నగర అసిస్టెంట్ కమిషనర్ అప్పలరాజు, సుఖీభవ ఆసుపత్రి ఎండీ పీఎస్‌వీ రామారావుతో పాటు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల బ్రాంచ్ మేనేజరు సోమశంకరరావు, ఏడీవీటీ మేనేజరు ఉమామహేశ్వరరావు బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి రూ.6 వేలు, రెండో బహుమతి రూ.4 వేలు, మూడో బహుమతి రూ.3 వేలు చొప్పున అందజేశారు. పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా బి.శ్రీనివాసరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో దాట్ల కిర్తీ మాట్లాడుతూ ఏ శుభకార్యం జరిగినా ముగ్గు విధిగా వేస్తామని, అటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించడం పట్ల ఆంధ్రజ్యోతికి అభినందనలు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో సీలింగు అంతా ముగ్గు డిజైనే ఉందని, మనం పైకి చూస్తే, చుక్కల ముగ్గులు కన్పిస్తాయని, అవి ఉత్తరాంధ్ర సాంప్రదాయానికి ప్రతీకగా చెప్పవచ్చునన్నారు. నగర అసిస్టెంట్ కమిషనర్ అప్పలరాజు మాట్లాడుతూ, సంక్రాంతి శోభ ఉట్టిపడేలా రంగవల్లుల పోటీలు నిర్వహించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. సుఖీభవ ఆసుపత్రి ఎండీ పీఎస్‌వీ రామారావు మాట్లాడుతూ, మన సంప్రదాయాన్ని గుర్తు పెట్టుకునేందుకు ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీలు ఎంతో దాహోదపడతాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకు తమ వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు రవ్వా మంజూ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ముగ్గులు బాగా వేశారని, నిబంధనలు అనుసరించి మార్కులు వేశామని చెప్పారు. కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు ఎ.దేవి, జి.కృష్ణవేణితో పాటు ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సిబ్బంది పాల్గొన్నారు.