సంకిలి రేషన్ డిపో డీలర్ అదృశ్యం
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:17 AM
మండలంలోని సంకిలి రేషన్ డిపో-1 డీలరు పానింగిపల్లి నర్సింగరావు(70) గత కొద్దిరోజులుగా అదృశ్యం అయినట్టు కుటుం బీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బాలకృష్ణ శని వారం తెలిపారు.
రేగిడి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని సంకిలి రేషన్ డిపో-1 డీలరు పానింగిపల్లి నర్సింగరావు(70) గత కొద్దిరోజులుగా అదృశ్యం అయినట్టు కుటుం బీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బాలకృష్ణ శని వారం తెలిపారు. ఈ ఘటనపై ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంకిలి గ్రామానికి చెందిన పానింగిపల్లి నర్సింగరావు చాలా సంవత్సరాలుగా గ్రామంలోనే రేషన్‌డిపో నడుపుతున్నారు. ఈయన భార్య మృతిచెందడంతో ఒక్కరే నివాసం ఉంటున్నారు. కుమారులు, కుమార్తె హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అయితే ఈయ న సుమారు పది రోజుల కిందట తన పిల్లల వద్దకు హైదరాబాద్ వెళ్లేందుకు చీపురుపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అయితే ఆయన హైదరాబాద్‌కు చేరకపోవడం తో పిల్లలు ఆందోళన చెందారు. దీంతో వారు చీపురుపల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చి, వెతికారు. అలాగే సంకిలిలో గాలించారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో రైల్వే పోలీసులను, స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పొరపాటున ఆయన వేరే రైలు ఎక్కిఉండవచ్చని, ఆ సమయంలో అతని ఫోన్ కూడా పనిచేయలేదని పిల్లలు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీలరు ఆచూకీ కోసం వెతుకుతున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. డీలర్ గ్రామంలో లేకపోవటంతో సంకిలి రేషన్-1 డిపో సేవలు నిలిచిపోయాయి. ఈయన స్థానాన్ని ఇన్‌చార్జితో భర్తీ చేస్తున్నట్టు డీటీ ఈశ్వరావు తెలిపారు.