శంకరన్ సేవలు చిరస్మరణీయం: పీవో
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:11 AM
సోషల్‌వర్కర్ ఎస్‌ఆర్ శంకరన్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు.
సీతంపేట, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): సోషల్‌వర్కర్ ఎస్‌ఆర్ శంకరన్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. గురు వారం సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఎస్‌ఆర్ శంకరన్ జయంతి పురస్కరిం చుకుని ఆయన చిత్రపటానికి పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ పూలమాలను వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవతాన్ని అంకితం చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఏవో సునీల్ తదితరులు పాల్గొన్నారు.