Share News

త్వరలో సంజీవని వైద్య సేవలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:01 AM

త్వర లోనే అన్ని కుటుంబాలకు సంజీవని వైద్య సేవలు అందనున్నాయని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.

త్వరలో సంజీవని వైద్య సేవలు

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి

లక్కవరపుకోట, అక్టోబ రు 5(ఆంధ్రజ్యోతి): త్వర లోనే అన్ని కుటుంబాలకు సంజీవని వైద్య సేవలు అందనున్నాయని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా సోమవారం ఎల్‌.కోట పీహెచ్‌సీలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు గొల్జాం గ్రామంలో వీబీజీ రాంజీ పథకం ద్వారా మంజూరైన 14 గోకులం షెడ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్టు ద్వారా రూ.45లక్షలతో చేపట్టనున్న రక్షిత తాగునీటి ట్యాం కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అమరజీవి జలధార కింద నియోజకవర్గానికి రూ.233.49 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర నాయకుడు కేబీఏ రాంప్రసాద్‌, పార్టీ నాయకులు చొక్కాకుల మల్లు నాయుడు, ఒబ్బిని సత్యనారాయణ, రమణమూర్తి, భూపాల్‌నాయుడు పాల్గొన్నారు.

వీబీజీరాంజీ ఉద్యోగుల వినతి

తమ సమస్యల పరిష్కారం కోరుతూ వీబీజీరాంజీ పథక ఉద్యోగులు సోమవారం స్థానిక ఎమ్మెల్యే లలితకుమారికి తన ఎల్‌.కోటలోని తన క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఏడేళ్లుగా జీతభత్యాలలో పురోగతి లేదన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

Updated Date - Oct 06 , 2026 | 12:01 AM