Share News

గరివిడిలో పారిశుధ్య కార్మికుల సమ్మె

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:28 AM

కొండపాలెం (గరివిడి) మేజరు పంచాయతీ పారిశుధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం నుంచి మెరుపు సమ్మెకు దిగారు.

గరివిడిలో పారిశుధ్య కార్మికుల సమ్మె

గరివిడి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): కొండపాలెం (గరివిడి) మేజరు పంచాయతీ పారిశుధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. కార్మికుల కు గత 15 నెలలుగా జీతాలు చెల్లించలేదు. ఈ సమ స్య పరిష్కరించాలని కోరుతూ వారు సమ్మెకు దిగారు. గత నెల ఇదే సమస్యపై కార్మికులు 12 రోజులు సమ్మె చేసినప్పుడు సంబంధిత అధికారులు కార్మికులతో చర్చలు జరిపి, ఆగస్టు 1వ తేదీన పెండింగ్‌లో ఉన్న వాటిలో ఐదు నెలల జీతాలు చెల్లిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో అప్పుడు సమ్మె విరమించారు. అయినా ఇప్పటివరకు ఐదు నెలల జీతాలు ఇవ్వకపోవడంతో మరోమారు కార్మికులు గత పది రోజుల నుంచి విధులకు గైర్హాజరయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం నుంచి సమ్మెకు కూడా దిగారు. వీరికి సీఐటీయూ నాయకుడు ఎ.గౌరినాయుడు తదితరులు మద్దతు పలికారు.

Updated Date - Aug 20 , 2026 | 12:28 AM