Sanitation measures in pogiri పొగిరిలో పారిశుధ్య చర్యలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:48 PM
Sanitation measures in pogiri డయేరియా ప్రబలిన పొగిరి గ్రామంలో అధికారులు మకాం వేశారు. గ్రామంలో పారిశుధ్య చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జీవనరాణి గురువారం పొగిరి గ్రామాన్ని సందర్శించారు. వైద్యపరంగా గ్రామంలో చేపడుతున్న సేవల వివరాలను పొగిరి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డా.గట్టి భార్గవిని అడిగి తెలుసుకున్నారు.
పొగిరిలో పారిశుధ్య చర్యలు
ఇంటింటా సర్వే
మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ
గ్రామంలో పర్యటించిన డీఎంహెచ్‌వో
రాజాం రూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): డయేరియా ప్రబలిన పొగిరి గ్రామంలో అధికారులు మకాం వేశారు. గ్రామంలో పారిశుధ్య చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జీవనరాణి గురువారం పొగిరి గ్రామాన్ని సందర్శించారు. వైద్యపరంగా గ్రామంలో చేపడుతున్న సేవల వివరాలను పొగిరి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డా.గట్టి భార్గవిని అడిగి తెలుసుకున్నారు. మెడికల్ ఆఫీసర్, వైద్యసిబ్బందితో కలిసి ఎగువవీఽధిలో ఇంటింటా వెళ్లి వారివారి ఆరోగ్య పరిస్థితుల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులను అందజేశారు. డయేరియా బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలకు వివరించారు. వైద్యసిబ్బంది బృందాలుగా ఏర్పడి గ్రామంలోని వీధుల్లో ఇంటింటా పర్యటించి డయేరియా లక్షణాలపై ఆరా తీశారు. గ్రామంలో వైద్యశిబిరాన్ని కొనసాగిస్తున్నారు. వీధుల పరిశుభ్రతతో పాటు కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను పారిశుధ్య సిబ్బందితో తొలగింపజేశారు. కాలువలు, వీధుల్లో బ్లీచింగ్ జల్లించే ఏర్పాట్లు చేశారు. డీఎల్‌డీవో హేమసుందర్, రాజాం ఎంపీడీవో వావిలపల్లి శ్రీనివాసరావు దగ్గరుండి శానిటేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. డయేరియా వ్యాపించిన ఎగువవీధిలోని తాగునీటి బోర్ల నీటిని పరీక్షలకు పంపించారు. గ్రామంలో కొత్తగా కేసులు నమోదు కాలేదని డీఎంహెచ్‌వో జీవనరాణి స్పష్టం చేశారు.