Share News

Jhanjavathi Canal జంఝావతి కాలువలో ఇసుక మేటలు

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:48 PM

Sand Deposits Accumulate in the Jhanjavathi Canal జంఝావతి ప్రాజెక్టు నుంచి ఈ నెల 2న నీరు విడుదల చేసినా శివారు ప్రాంతాల్లో పంట భూములకు నీరందడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు పార్వతీపురం మండలం అడ్డాపుశీల ప్రాంతంలోని సాగునీటి కాలువలో అధికంగా ఇసుక మేటలు వేశాయి.

 Jhanjavathi Canal జంఝావతి కాలువలో ఇసుక మేటలు
అడ్డాపుశీల ప్రాంతంలో కాలువలో ఇసుక మేటలు వేసిన దృశ్యం

గరుగుబిల్లి, జూలై8(ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు నుంచి ఈ నెల 2న నీరు విడుదల చేసినా శివారు ప్రాంతాల్లో పంట భూములకు నీరందడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు పార్వతీపురం మండలం అడ్డాపుశీల ప్రాంతంలోని సాగునీటి కాలువలో అధికంగా ఇసుక మేటలు వేశాయి. మరోవైపు పార్వతీపురం -పాలకొండ ప్రధాన రహదారితో పాటు అడ్డాపుశీలలోని రోడ్డు కోతకు గురవుతుండడంతో ఆ మట్టి కూడా కాలువలో పేరుకుపోతోంది. దీంతో గరుగుబిల్లి మండలానికి నీరు సరఫరా కావడం లేదు. ప్రధానంగా జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి కాలువల అభివృద్ధికి నిధులు సమస్య వెంటాడుతుంది. దీంతో గత కొద్ది రోజులుగా కాలువ పరిధిలో ఇసుక మేటలు వేసినా అధికారుల స్పందన కరువైంది. ప్రస్తుతం ఖరీఫ్‌ పనులకు సిద్ధమైన సమయంలో సాగునీటికి ఆటంకం నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై జంఝావతి ప్రాజెక్టు ఏఈ పి.పవన్‌కుమార్‌ను వివరణ కోరగా.. ‘ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికే కాలువను పరిశీలించాం. నిధుల సమస్య కారణంగా పనుల నిర్వహణకు రైతులు ముందుకు రావాల్సి ఉంది.’ అని తెలిపారు.

Updated Date - Jul 08 , 2026 | 11:48 PM