అధిక ధరలకు యూరియా విక్రయం
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:31 AM
సిరిపురం గ్రామానికి చెందిన ప్రసన్నాంజ నేయ ఫెర్టిలైజర్ ఎరువుల దుకాణం లైసెన్స్‌ను నెల రోజులపాటు సస్పెండ్ చేసిన ట్టు మండల వ్యవసాయ అధికారి సీబీ యశ్వంతరావు శుక్రవారం తెలిపారు.
నెల రోజులపాటు ఎరువుల దుకాణం సస్పెన్షన్
సంతకవిటి, జూలై 24(ఆంధ్రజ్యోతి): సిరిపురం గ్రామానికి చెందిన ప్రసన్నాంజ నేయ ఫెర్టిలైజర్ ఎరువుల దుకాణం లైసెన్స్‌ను నెల రోజులపాటు సస్పెండ్ చేసిన ట్టు మండల వ్యవసాయ అధికారి సీబీ యశ్వంతరావు శుక్రవారం తెలిపారు. అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నట్లు కలెక్టరేట్‌కు ఫిర్యాదులు అందడంతో ఈనెల 21న తనిఖీఅధికారులు దుకాణాన్ని పరిశీలించారని ఆయన చెప్పారు. తని ఖీ సమయంలో సంబంధిత నిర్వాహకులు.. అధికారుల విధులకు ఆటంకం కలి గించడంతో పాటు, అవసరమైన రికార్డులను సక్రమంగా అందించకుండా, తనిఖీకి సహకరించలేదని చెప్పారు. ఈనేపథ్యంలో సంబంధిత ఎరువుల దుకాణానికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని, అలాగే దుకాణం లైసెన్స్‌ను 30 రోజుల పాటు సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు.