‘వీఆర్‌ఏలకు వేతనాలు పెంచాలి’
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:04 AM
వీఆర్‌ఏలకు వేతనాలు పెంచాలని సీఐటీయూ నాయకుడు వై.మన్మథరావు డిమాండ్ చేశారు.
బెలగాం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): వీఆర్‌ఏలకు వేతనాలు పెంచాలని సీఐటీయూ నాయకుడు వై.మన్మథరావు డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాల యం ఎదుట వీఆర్‌ఏలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మన్మథరావు మాట్లాడుతూ వీఆర్‌ఏలకు 8 ఏళ్లుగా జీతాలు పెరగలేదన్నారు. తక్షణమే వారికి పే స్కేల్ వేతనాలు అమలు చేయాలన్నారు. అర్హులైన వీఆర్‌ఏలకు వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలన్నారు. నైట్ వాచ్‌మెన్, అటెండర్ పోస్టులను 70 శాతం మందికి కేటాయించాలన్నారు. ఆందోళనలో సీఐటీయూ నాయకులు వెంకటరమణ, బి.వి.రమణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.