Share News

Safety Standards భద్రతా ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:12 AM

Safety Standards Must Be Followed జిల్లాలో స్ర్టాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవారం సాలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలు, బాలెట్‌ బాక్సులను భద్రపరిచే స్ర్టాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

Safety Standards   భద్రతా ప్రమాణాలు పాటించాలి
సాలూరు చెక్‌పోస్టులో సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఎస్పీ మాదవరెడ్డి

సాలూరు/గరుగుబిల్లి/మక్కువ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్ర్టాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవారం సాలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలు, బాలెట్‌ బాక్సులను భద్రపరిచే స్ర్టాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనధికార వ్యక్తులు లోపలకి ప్రవేశించకుండా చూసుకోవాలని ఆదేశించారు. నిరంతర పోలీసు నిఘా కొనసాగించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట అదనపు బలగాలను సిద్ధంగా ఉంచాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం సాలూరు పట్టణంలో ఏర్పాటు చేసిన స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీం చెక్‌పోస్టును తనిఖీ చేశారు. అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులు రవాణా జరగకుండా చూడాలని, ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రహదారుల మీద కూడా దృష్టి సారించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఇప్పటికే పార్వతీపురంలో 3, పాలకొండలో 2, సాలూరు 2 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు ఎఫ్‌ఎస్‌టీ, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలతో 24 గంటల పాటు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. తనిఖీల సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌక్యం కలగకుండా చూడాలని, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

- ఉల్లిభద్రలోని వైఎస్‌ఆర్‌ ఉద్యానవన కళాశాలను సైతం ఎస్పీ పరిశీలించారు. ఈ కళాశాల పరిధిలో గరుగుబిల్లి, కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండ లాలకు సంబంధించి ఓట్లు లెక్కింపు జరగనుందన్నారు. బ్యాలెట్‌ బాక్సుల భద్రత, సీసీ కెమెరా లను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని పాలకొండ డీఎస్పీ రాంబాబుకు సూచించారు.

- అనంతరం మక్కువ పోలీస్టేషన్‌ను ఎస్పీ పరిశీలించారు. ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్‌ దాఖల వివరాలు, మక్కువతోపాటు పరిసర గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలపై స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా చూడాలని సూచించారు.

Updated Date - Oct 27 , 2026 | 12:12 AM