పెద్దగెడ్డను పరిశీలించిన భద్రతా కమిటీ
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:56 PM
Safety Committee Inspects Peddagedda పాచిపెంటలోని పెద్దగెడ్డ జలశయాన్ని రిజర్వాయర్ల భద్రత కమిటీ బృందం సోమవారం పరిశీలించింది. విశాఖ సివిల్ ఎస్ఈ కృష్ణారావు, భీమవరం ఎస్ఈ రామచంద్రరాజు , విజయవాడకు చెందిన మెకానికల్ సీఈ శ్రీనివాసరాజు తదితరులు జలాశయం గేట్లు స్థితిగతులపై ఆరా తీశారు. స్పిల్వే, డ్యాం రాతి కట్టలను పరిశీలించారు.
పాచిపెంట రూరల్, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పాచిపెంటలోని పెద్దగెడ్డ జలశయాన్ని రిజర్వాయర్ల భద్రత కమిటీ బృందం సోమవారం పరిశీలించింది. విశాఖ సివిల్ ఎస్ఈ కృష్ణారావు, భీమవరం ఎస్ఈ రామచంద్రరాజు , విజయవాడకు చెందిన మెకానికల్ సీఈ శ్రీనివాసరాజు తదితరులు జలాశయం గేట్లు స్థితిగతులపై ఆరా తీశారు. స్పిల్వే, డ్యాం రాతి కట్టలను పరిశీలించారు. అనంతరం వారు విలేఖర్లతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జలాశయం నిర్వహణ బాగానే ఉందన్నారు. గేట్లు, వినియోగంలో ఉన్న యాంత్రీకరణ పరికరాలకు మెయింటెన్స్ చేపట్టాల్సి ఉందని వెల్లడించారు. పరిశీలన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో వారి వెంట పెద్దగెడ్డ జేఈ మోహన్రావు, ఇరిగేషన్ సిబ్బంది ఉన్నారు.