ప్రతీ ఇంటికి రక్షిత నీరు
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:12 AM
ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరు అందించేందుకు పైలెట్ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
సాలూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరు అందించేందుకు పైలెట్ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం పట్టణంలోని రూ.7.20 లక్షలతో ఏర్పాటు చేసిన నాలుగు పైలెట్ నీటి పథకాలను ఆమె ప్రారంభించారు. పట్టణంలోని 15వ వార్డు రెల్లివీధి, 21వ వార్డు గొల్లవీధి, 21వ వార్డు లావుడి వీధి, 22వ వార్డు తెలగా వీధిలో నీటి పథకాలు ఏర్పాటయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ వార్డులో అవసరాన్ని బట్టి కొత్త తాగునీటి పథకాలు ఏర్పాటు చేస్తామన్నారు. సాలూరును మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడంలో ఇది మొదటి అడుగన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.