Share News

Sri Chakra Theertha Holy Bath నేత్రపర్వం.. శ్రీచక్ర తీర్థ స్నానం

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:58 PM

Sacred Vision: Sri Chakra Theertha Holy Bath ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో ఆదివారం శ్రీవారి కల్యాణ మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్శంగా చివరి రోజు భక్తజనం నడుమ వెంకన్నకు శ్రీచూర్ణోత్సవం, శ్రీచక్ర తీర్థస్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు.

 Sri Chakra Theertha Holy Bath నేత్రపర్వం.. శ్రీచక్ర తీర్థ స్నానం
స్వామివారికి చక్ర తీర్థ స్నానం చేస్తున్న అర్చకులు

  • తోటపల్లిలో ముగిసిన కల్యాణ మహోత్సవాలు

గరుగుబిల్లి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో ఆదివారం శ్రీవారి కల్యాణ మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్శంగా చివరి రోజు భక్తజనం నడుమ వెంకన్నకు శ్రీచూర్ణోత్సవం, శ్రీచక్ర తీర్థస్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా దేవస్థానంలో నిత్యారాధన, విశేష హోమాలు, మంగళా శాసనములుతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిలో తిరువీధి నిర్వహించారు. ఆ తర్వాత నాగావళి నదీ తీరంలో శ్రీవారికి చూర్ణోత్సవం, చక్ర తీర్థస్నానం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో నదీ ప్రాంతం గోవింద నామస్మరణతో మార్మోగింది. స్వామివారి శ్రీచక్ర స్నానంతో భక్తులు పులకించిపోయారు. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో బి.శ్రీనివాస్‌, చైర్మన్‌ ఎం.పకీరునాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం అభివృద్ధి సేవా కమిటీ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉచిత ప్రసాదాలతో పాటు అన్నసమారాధన నిర్వహించారు. శ్రీవారి సేవకులు భక్తులకు అవసరమైన సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో కోలాట ప్రదర్శన పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది.

Updated Date - Feb 01 , 2026 | 11:58 PM