Share News

Sub-Collector పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా సచిన్‌ రహర్‌

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:44 PM

Sachin Rahar Appointed as Parvathipuram Sub-Collector పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా 2024 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సచిన్‌ రహర్‌ నియామకమయ్యారు. అక్టోబరు ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Sub-Collector పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా సచిన్‌ రహర్‌
సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ రహర్‌

పార్వతీపురం రూర‌ల్‌, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా 2024 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సచిన్‌ రహర్‌ నియామకమయ్యారు. అక్టోబరు ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. హర్యానాలో భవానీ జిల్లా లోహరుకు చెందిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో బీఎస్సీ, జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. 2022లో యూపీఎస్‌సీలో 176 ఆల్‌ ఇండియా ర్యాంక్‌ సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఏపీ క్యాడర్‌కు ఆయన్ని కేటా యించగా.. ప్రస్తుతం అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌గా అనంతపురం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి వీర్‌సింగ్‌ మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా, తల్లి రజబాల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పార్వతీపురం ఆర్డీవోగా, పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న మాధురి జిల్లాకు వచ్చి నాలుగు నెలలు కాకముందే బదిలీ అయ్యారు.

Updated Date - Sep 29 , 2026 | 11:44 PM